30 June, 2026 | 4:42 PM

సరూర్‌నగర్‌లో పేలుడు.. ధ్వంసమైన ఇల్లు

30-06-2026 03:44 PM

హైదరాబాద్: సరూర్‌నగర్‌(Saroornagar) బాపూనగర్‌లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ గృహోపకరణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్, సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ అన్నీ సురక్షితంగా ఉండటం, అగ్ని ప్రమాద ఆనవాళ్లు లేకపోవడంతో పేలుడుకు కారణం మిస్టరీగా మారింది. వంటగదిలోని సామాగ్రి పూర్తిగా పాడైపోయింది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటి నుండి ఆధారాలను సేకరించేందుకు 'క్లూస్ టీమ్'ను కూడా రంగంలోకి దించారు.