30 June, 2026 | 4:19 PM

రైతు సమస్యలు పరిష్కరించాలని వినతి

30-06-2026 03:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జెసి కిషోర్ కుమార్ కు వినతిపత్రం అందించారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమయ్యే ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందిరామయ్య, మహేందర్ బక్కన్న తదితరులు ఉన్నారు.