పీఈసెట్‌లో 1106 సీట్లు భర్తీ
03-08-2026 02:06 AM
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): బీపీఈడీ, యూజీడీపీ ఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్ తొలివిడత సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 1,743 సీట్లకు గాను 1,400 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, వీరిలో 1,106 మందికి సీట్లు లభించాయి. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 3 నుంచి 6వ తేదీలోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.






