3 August, 2026 | 3:22 AM

విషాదంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

03-08-2026 02:08 AM

వేదికపై మాట్లాడుతూ కుప్పకూలి వ్యక్తి మృతి

మాడ్గుల, ఆగస్టు 2 (విజయక్రాంతి): 30 ఏళ్ల తర్వాత బాల్యమిత్రులందరూ ఒకే వేదికపైకి చేరుకున్నారు. జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. అంతలోనే  విషాదం ఆనందాన్ని మింగేసింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం బ్రాహ్మణపల్లి సెంట్ గేటన్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ (1997 బ్యాచ్) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థి జేల్లా యాదగిరిమాట్లాడుతుండగానే హఠాత్తుగా కుప్పకూలారు.   

ఆసుపత్రికి తరలించగా, అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  మృతుడికి భార్య మంగ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.