14 July, 2026 | 2:17 AM

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్

13-07-2026 09:49 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట   33 / 11 కెవి  సబ్స్టేషన్లో 3.15 ఎంవిఏ బదులు నూతనంగా 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం నాడు కామారెడ్డి జిల్లా ఎస్సీ శాలియా నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్య అధికంగా ఉండడంతో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రీక్వెన్సీ పెంచినట్లు ఆయన తెలిపారు.  కార్యక్రమంలో బాన్సువాడ డిఈఈ వినోద్, పిట్లం ఏడిఏ అరవింద్,సెక్షన్ ఏ ఈ మోహన్ నాయక్  అచ్చంపేట గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.