14 July, 2026 | 2:14 AM

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి

13-07-2026 09:53 PM

సర్పంచ్ దీప్తిరఘురాం గౌడ్

హన్వాడ: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల  అంగన్వాడి కేంద్రాలలో గ్రామ సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్  1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ (Albendazole) మాత్రలను వైద్య సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్ మాట్లాడుతూ.... నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, ఎదుగుదల మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆల్బెండాజోల్ మాత్రలు నులిపురుగులను నివారించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని, ఇవి పూర్తిగా సురక్షితమైనవని, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయబడుతున్నాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వెంకటయ్య, సత్యమ్మ, ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిశంకర్, అంగన్వాడీ టీచర్ పద్మ, ఆశా వర్కర్ పుష్ప, చెన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.