నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత
13-07-2026 09:45 PM
ఏసీ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): వైట్ హౌస్‌లో అక్షర ఫౌండేషన్–సూర్యాపేట ఆధ్వర్యంలో యాస శృతి సౌజన్యంతో జిల్లాకు చెందిన పదవ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థిని సప్పిడి నందిని కి రూ.10,000 విలువైన చెక్కును ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకూడదని, విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి సమాజం అండగా నిలవాలని అన్నారు. విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. జీవితంలో ఎదిగిన వారు ప్రతి ఒక్కరు సమాజసేవలో రాణించాలని కోరారు.






