ఇంతలా దిగజారిన సీఎం నువ్వే!
- సమైక్యాంధ్రలో సీఎంలు సంయమనంతో మాట్లాడారు
- వైఎస్‌ఆర్ తలేడ పెట్టుకుంటావు అన్నప్పుడే బాధకలగలేదు
- ముఖ్యమంత్రిగా నీ మాటలు చూసి బాధేస్తోంది
- సీఎం రేంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్/ఖైరతాబాద్, జూలై 13 (విజయక్రాంతి) : ఇంతలా దిగజారి మాట్లాడు తున్న సీఎంను నిన్నే చూస్తున్నా..దేశంలో ఏ రాష్ట్ర సీఎం కూడా నీలా మాట్లడలేదు. సమైక్యాంధ్రలో కూడా సీఎంలు ఎంతో సమ యంనంతో సమాధానం చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలేడ పెట్టు కుంటావు అన్నప్పుడే బాధ కలుగలేదు. కానీ ముఖ్యమంత్రిగా నీ మాటలు చూసి బాధేస్తోంది. ఇంజినీర్లపై నీవు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
ఎన్‌డీఎస్‌ఏ చెప్తేనే నీళ్లు నింపుతాననడం నీ అజ్ఞానానికే నిదర్శనం’ అని సీఎం రేంత్‌రెడ్డిపై బీజేపీ ఎం పీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడడం ప్రజలను కుంగదీస్తోందని మండిపడ్డారు. కుసంస్కార మాటలకు తెలంగాణ సమాజం బాధపడుతోందన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కరువు అనే అంశం పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడారు.
సీఎం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. దేశంలో ఏ రాష్ట్ర ము ఖ్యమంత్రి కూడా మాట్లాడని భాషతో మాట్లాడుతున్నారని, ప్రజలు అధికారాన్ని పీకేస్తే తనకు తెలుస్తందన్నారు. ‘ఖబర్దార్ రేవంత్‌రెడ్డి.. పదవి ఉందనే అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీ ఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఓ సందర్భంలో ‘ఇప్పుడు నీ తల ఏడ పెట్టుకుంటావ్ ఈటల రాజేందర్’ అన్నారు.
అప్పుడు నాకు బాధ కలుగలేదు. కానీ రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలు విని బాధకలుగుతోంది’ అని అ న్నారు. సుందిళ్ల బరాజ్‌ల పిల్లర్లు ఎక్కడా కుంగిపోలేదన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్ర కారం.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు గ్రౌ టింగ్ కూడా చేశారని గుర్తు చేశారు. 2023 లో లక్మీ బారాజ్ పిల్లర్లు కుంగిపోయాయని, తప్పు రుజువైతే ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను శిక్షించాలన్నారు. తాము రైతులకి, ప్రజలకు, న్యాయానికి, ధర్మానికి సపోర్ట్ అన్నారు.






