14 July, 2026 | 4:11 AM

రేవంత్‌కు బీఆర్‌ఎస్వీ రక్తదానం

14-07-2026 01:07 AM
  1. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌వీ రక్తదాన శిబిరం
  2. రక్తదానం చేసిన 50 మంది విద్యార్థి నాయకులు
  3. రక్తం ప్యాకెట్లతో సీఎం నివాసానికి.. అడ్డుకున్న పోలీసలు
  4. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తం
  5. పాల్గొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు
  6. అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలింపు

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): పంటలకు బీఆర్‌ఎస్ నేతల రక్తం చల్లాలన్న సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం బీఆర్‌ఎస్‌వీ రక్తదానం చేసింది. ‘మా రక్తంతోనే మీ దా హం తీర్చుకోండి’ అంటూ 50 మంది బీఆర్‌ఎస్వీ నేతలు రక్తం ఇచ్చారు. రక్తంప్యాకెట్ల తో తెలంగాణ భవన్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మా జీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్వీ నాయకులు తరలి వెళ్లుతుండగా, వారి ని పోలీసులు అడ్డుకున్నారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు నినదించారు. దీంతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్వీ ముఖ్యనేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పంటలకు బీఆర్‌ఎస్ నేతల రక్తం చల్లాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) సోమవారం తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిం చింది.

బీఆర్‌ఎస్వీ నేతలు ‘మా రక్తంతోనే మీ దాహం తీర్చుకోండి’ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ.. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కే సంజయ్, మాజీ మం త్రులు లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్‌గౌడ్, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఉపాధ్యక్షులు తుంగబాలు, కడారి స్వామియాదవ్, పడాల సతీష్, దశరథ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్య లు చేయడం సరికాదని విమర్శించారు. రక్తదాన శిబిరంలో దాదాపు 50 మంది బీఆర్ ఎస్వీ కార్యకర్తలు రక్తం ఇచ్చారు.

అనంతరం సేకరించిన రక్తం ప్యాకెట్లను సీఎం నివాసానికి తీసుకెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. దీంతో వారిని తెలంగాణ భవన్ ఎదుటే పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడంతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీఆర్‌ఎస్వీ ముఖ్యనే తలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని రెండు వాహనాల్లో అంబర్‌పేట్, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లకు తరలించారు.