20 June, 2026 | 4:03 AM

పాఠశాల యాజమాన్యాలు పుస్తకాల పేరుతో వసూలు చేస్తున్న అధిక ఫీజులను తగ్గించాలి

20-06-2026 01:41 AM

నాయుడు రాఘవరావు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి 

సత్తుపల్లి. జూన్ 19 (విజయక్రాంతి): బీజేపీ సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు బాణావత్ విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులను తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

గత వారం రోజులు నుంచి అనేకమంది తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందాయన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాల రూపంలో పాఠశాల యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజులను చూసి బెంబేలెత్తుతున్నారన్నారు కాబట్టి పాఠశాల యాజమాన్యాలు పుస్తకాల అసలు  ధరను మాత్రమే తీసుకోవాలన్నారు. బయటకొనుకున్నందుకు కూడా తల్లిదండ్రులకు అవకాశం కల్పించాలన్నారు.

ఇవేమీ లేకుండా అలా కాకుండా ఐదు రెట్లు, ఆరు రెట్లు కలిపి పుస్తకాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికే సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అయినప్పటికీ మీరు ఫీజులు తగ్గించకపోతే జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కాబట్టి విద్యాసంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించి ఫీజులు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్మండల ప్రధాన కార్యదర్శి మందా శివకృష్ణ యాదవ్,పట్టణ కార్యదర్శి  కార్తీక్ యాదవ్‌అశోక్ డాక్టర్ పెద్దిరాజువీరబాబుసీనియర్ నాయకులు మన్నేని నరసింహమూర్తి  తదితరులు పాల్గొన్నారు.