25 July, 2026 | 3:53 AM

మద్యం, డ్రగ్స్ వల్లే సౌదీ ప్రిన్స్ మృతి

25-07-2026 12:00 AM

గతేడాది లండన్ కెన్సింగ్టన్‌లోని హోటల్‌లో ఘటన

లండన్, జూలై 24: సౌదీ రాజ కుమారుడు ‘అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్’(29) అధిక మద్యం, డ్రగ్స్, ఔషధాలు ఒకేసారి తీసుకోవడం వల్లే మృతి చెందాడని బ్రిటిష్ కోర్టు తెలిపింది.  గతేడాది నవంబర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యం గా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గతేడాది నవంబర్ 19న లండన్ కెన్సింగ్టన్‌లోని మారియట్ హోటల్‌లో బిన్ అబ్దుల్లా బస చేశారు.

నవంబర్ 25న హోటల్ గదిలో స్పృహ కోల్పోయి కనిపించారు. హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రకటించా రు. దర్యాప్తులో అధిక మద్యం, డ్రగ్స్, వైద్యులు సూచించిన మందులు ఒకేసారి తీసుకోవడంతో గుండెపోటుకు దారితీసినట్లు అధికారులు వెల్లడించారు.

రాజకుమా రుడి మృతిని సౌదీ రాయల్ కోర్టు అధికారికంగా ధ్రువీకరించింది. అబ్దుల్లా అంత్యక్రి యలను రియాద్‌లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో నిర్వహించినట్లు ప్రకటించింది. కాగా యువరాజు మృతి పై కుట్ర, ఆత్మహత్య లాంటి అనేక ఆరోపణలు వచ్చాయి. కాగా రాజకుమారుడు దురలవాట్లకు బానిసగా మారి చికిత్స తీసుకున్నట్లు ఆయనకు చికిత్స అందించిన వైద్యులు, సైక్రియాటిస్ట్‌లు వెల్లడించారు.