16 July, 2026 | 1:56 AM

మున్సిపల్ బాగోతం ఇలా కూడా ఉంటుందా..

16-07-2026 01:47 AM

డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారా.

పైసలిస్తే కావలసిన కాగితం వచ్చినట్లే... సత్తుపల్లి మున్సిపాలిటీ పరిస్థితి .

సత్తుపల్లి జూలై15 (విజయక్రాంతి): ఎవరికైనా ఏ పని కావాలన్నా ,పైసలు ఇస్తే పక్కాగా పనిచేసే పరిస్థితి సత్తుపల్లి మున్సిపాలిటీ ఆదర్శంగా ఉంది. ఇందుకు నిదర్శనంగా పట్టణంలోని రాజీవ్ కాలనీలో గల 342 ఫ్లాట్ నెంబర్ బుద్ధా జయమ్మ పేరుతో పట్టా ఉంది, దానిలో ఒకరు ఉంటూ దాని పైనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మున్సిపాలిటీలో అప్లై చేసి ఉన్నారు. దానికి కరెంటు మీటర్ కోసమని ఎన్.ఓ.సి ఇచ్చి మీటర్ శాంక్షన్ చేపించిన ఘనత మున్సిపాలిటీకి దక్కింది.

ఎన్.ఓ.సి సర్టిఫికెట్ అన్ని తప్పులుగా, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఒక ఎగ్జిక్యూటివ్ ఫీల్ చేసినట్లుగా కాకుండా, మిడిమిడి చదువుకున్న వారితో తప్పులుగా రాపించి సర్టిఫికేట్ పొందినారు. అదే సర్టిఫికెట్ తో జీవో నెంబర్ 58 రిజిస్ట్రేషన్ చేపించుకున్నట్లుగా సమాచారం. ఆ ఇంటికి ఇప్పటివరకు నీటి బిల్లు గాని, హౌస్ టాక్స్ గాని కట్టించుకున్న దాఖలాలు లేవు, మున్సిపల్ సిబ్బంది ఏమి చోద్యం చూస్తున్నారు అర్థం కావట్లేదు. పైసలు ఇస్తే అందరూ మనవాళ్లేనా వాళ్ళని పట్టించుకోరా, పై అధికారులైన పట్టించుకోని నిజా నిజాలు నిరూపణలు చేస్తే నష్టపోయిన వారికి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.