కరీముల్లా మృతికి కూసంపూడి నివాళి
16-07-2026 01:49 AM
సత్తుపల్లి జూలై15 (విజయక్రాంతి): పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన షేక్ కరీముల్లా టింకరింగ్ మేస్త్రి, అనారోగ్యంతో బుధవారం మృతి చెందినారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్, 14వ వార్డు కౌన్సిలర్ కూసంపూడి మహేష్ కరీముల్లా మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతికి గల కారణాలు తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో, బి.ఆర్.ఎస్ నాయకులు షేక్ చాంద్ పాషా, అద్దంకి అనిల్, గండ్ర రఘు, గాదె సురేష్, జొన్నలగడ్డ విజయ్, ఆజార్, సత్తార్ తదితరులున్నారు.






