16 July, 2026 | 1:46 AM

అది ఎన్డీఏ రిపోర్ట్

16-07-2026 01:33 AM

ఎన్‌డీఎస్‌ఏ ఒక సలహా సంఘం మాత్రమే

  1. కాళేశ్వరానికి యజమాని తెలంగాణే.. కేంద్రం కాదు
  2. కాళేశ్వరంలో నీళ్లు నింపక పోవడం నేరపూరిత చర్య 
  3. టీఆర్‌ఎస్‌తో మాకు 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం 
  4. ఢిల్లీ చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఎన్డీఎస్‌ఏ అనేది కేవలం ఒక సలహా సంఘం(అడ్వైజ్ కమిటీ) మాత్రమేనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలైన ఓనర్ రాష్ట్ర ప్రభుత్వమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం నిర్మించి, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని సూచించా రు. అయితే అక్కడ నీళ్లు ఎత్తిపొస్తే మళ్లీ కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అసూయతో రేవంత్‌రెడ్డి ఉన్నాడని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరం వ్యవహారం అనగానే ఎన్నికల ముందు అకస్మాత్తుగా ఎన్డీఎస్‌ఏ రంగంలోకి వచ్చిందని, కేవలం రెండు రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చేసిందని గుర్తుచేశారు. అది నిజానికి ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని ఆరోపించారు. గతంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలితే రాని ఎన్డీఎస్‌ఏ, అలాగే పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాల్ కూలితే రాని ఎన్డీఎస్‌ఏ ఇక్కడికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు కేవలం రాజకీయం కోసమే ఇదంతా కుట్ర చేశారని విమర్శించారు. కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని కేటీఆర్ అభివర్ణించారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారని, కేవలం 8.5 కోట్లతో కాపర్ డ్యాం కట్టొచ్చని చెప్పారని, కానీ ఆ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టకుండా దాచిపె ట్టిందని ఆరోపించారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో అక్కడ మీడియాతో కేటీఆర్ చి ట్‌చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ... ‘మా నాయకుడు కేసీఆర్ మారలేదు. మా ఎజెండా కూడా మార లేదు’ అని కేటీఆర్ అన్నారు. గతంలో రెండుసార్లు ‘ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఈ సారి జరిగిన ఓటమికి ప్రజలను మాత్రం బాధ్యులను చేయలేం’ అని చెప్పారు. తమ వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటామ ని పేర్కొన్నారు. ‘మాకంటే మెరుగైన పాలన అందిస్తారనే నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, కానీ ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది తెలంగాణలో తాను స్వయంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఓటమికి కార ణాలు చాలా ఉన్నాయని, వాటిపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు పోతున్నామన్నా రు. నాయకుడు కేసీఆర్ వచ్చేటప్పుడు కచ్చితంగా వస్తాడని, ప్రస్తుతం నన్ను, హరీశ్‌రా వునే రేవంత్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని ఎ ద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్ పేరుతో మాకు 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని, అది తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ అని గుర్తుచేశారు. ఇప్పుడు ఇంకెవరో వచ్చి ఆ పేరును తీసుకుంటాం అంటే తెలంగాణ సమాజంలో ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అనేది మా క్రెడిబిలిటీ అని, ఆరేళ్ల పాటు టీఆర్‌ఎస్ అనేది ప్రీ జ్ చేసిన పేరు అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తే తా ము ఎలా ఊరుకుంటామని హెచ్చరించారు. 

నా పోరాటం రేవంత్‌రెడ్డితోనే..

నా పోరాటం సీఎం రేవంత్‌రెడ్డితో, నా యుద్ధం తెలంగాణ కోసమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టి మరల్చడంలో నాలుగైదు పీహెచ్‌డీలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధి కారంలోకి వచ్చి 31 నెలల తర్వాత కూడా ప్రతిరోజు మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీని ఒక చచ్చిన శవం అని అంటారు. అలాంటప్పుడు మరి ఎందుకు పదేపదే ప్రతిరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న అడ్డగోలు మాటలపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడని, ఆయనకు ఇవేవీ పట్టించుకోడా అని నిలదీశారు. కాళేరం ప్రాజెక్టు విష యంలో రేవంత్‌రెడ్డి కావాలనే రైతులకు ఇ బ్బంది కలిగిస్తున్నారని, తమపై ఉన్న కోపా న్ని ఈ ప్రభుత్వం రైతుల మీద చూపెడుతోందని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఇప్ప టికీ 76 సార్లు వచ్చాడని, కనీసం 76 పైసలైనా రాష్ట్రానికి తీసుకువచ్చాడా అని ప్రశ్నిం చారు. ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధికారులను ఎందుకు కలవలేదని, ఎన్‌డీఎస్‌ఏ కార్యాలయానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇటీవల వచ్చిన నాలుగు సర్వేల ఫలితాలు చూశాకే రేవంత్‌రెడ్డి తీవ్ర గాబరా పడుతున్నాడని తెలిపారు.

రాబోయే రోజు ల్లో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయని, అ యితే మేం మాత్రం ఎటువంటి సర్వేలు చేయలేదని కేటీఆర్ వివరించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయినాక కూడా ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. అలాగే, జూలై 31న జరగబోయే ఈ కార్ రేస్ కేసులో తాను కోర్టుకు హాజరవుతానని స్పష్టం చేశారు.

భూములతో లాక్ అన్‌లాక్ గేమ్..

కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, ఆయనపై వ్యక్తిగత కక్షలు కూడా లేవని చెప్పారు. అయితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉం టే బాగుండేదని, దానివల్ల మంచి పేరు ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్‌లాక్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి విపరీ తంగా పెరిగిపోయిందని, భూముల వివాదాలను అన్‌లాక్ చేసేందుకు ఏకంగా 30 శాతం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

పొంగులేటి 30 పర్సెంట్ మినిస్టర్‌గా మారి, అందరికంటే అవినీతిలో ముందున్నాడని ధ్వజమెత్తారు. దక్షిణాది వాటా తగ్గకుంటేనే పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణా ది రాష్ట్రాల వాటా 24 శాతం గానే కొనసాగాలన్నారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా తప్పదన్నారు.

ఏదైనా సరే బీజేపీ అనుకుంటే ఫాస్ట్‌గా అవుతుందని, లేదంటే ఆలస్యం తప్పదని వ్యా ఖ్యానించారు. ఒకవేళ కేవలం సెన్సస్ (జనాభా లెక్కల) ప్రకారమే సీట్లు కేటాయిస్తే సౌత్ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. . 

కాంగ్రెస్ నీళ్లివ్వడం లేదు..

తెలంగాణ రైతులు రక్తం ఇస్తున్నా కాంగ్రెస్ నీళ్లు ఇవ్వడం లేదు అన్నారు. ప్రభు త్వ నిర్వాకం వల్లే సూర్యాపేట వద్ద ఉన్న ఓ తండాలో రైతు తన రక్తం చల్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భారీగా గోదావరి వ రదలు వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ, భద్రాచలం ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం కలగలే దని గుర్తుచేశారు. వర్షాకాలంలో గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తే వారు ఇక్కడి నుంచి పారిపోరా అని ప్రశ్నించారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం నగరాభి వృద్ధి కోసం ఎయిర్‌పోర్ట్ మెట్రో ఏర్పాటుకు శ్రీకారం చుట్టి పనులు మొదలుపెట్టిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ఎయిర్‌పోర్ట్ మెట్రోను రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. మెట్రో భూములు అయిన 280 ఎకరాలపై రేవంత్‌రెడ్డి కన్ను పడిందని, ఎలాగైనా వాటిని అమ్మేస్తాడని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ చేసిన అప్పులను ప్రభుత్వం ఎందు కు కట్టాలని ఆయన ప్రశ్నించారు.

లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు లేకపోవడం వల్లే ఢిల్లీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో 15 మంది ఎంపీలతో మేము లోక్ సభలోకి వస్తే పార్లమెంట్‌లో మా బలం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో ఏపీని చూసి తెలంగాణ నేర్చుకోవాలని హితవు పలికారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ ఏపీ రైతులను ఆ ప్రభుత్వం బాగా కాపాడుకుంటుందని అభినందించారు.