ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్‌కు మంత్రి హోదా
జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి
చర్ల, జూలై 15 (విజయక్రాంతి): జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డా. అద్దంకి దయాకర్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో చర్లలో హర్షోత్సాహాలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. గత 30 ఏళ్లుగా దళిత, బహుజన, మాల సామాజిక వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అవిరళంగా పోరాడుతున్న డా. అద్దంకి దయాకర్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ గుర్తింపు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ ఇది రాష్ట్రంలోని కోట్లాది దళితులకు దక్కిన గౌరవం. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు ఇది నిదర్శనం‘ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎ. గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు, మండల నాయకులు పాల్గొన్నారు.






