కేకేకు శాతవాహన జేఏసీ వినతి
శాతవాహన యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని కోరిన నాయకులు
ముకరంపుర, జూలై 8 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ వ్యవస్థాపకులు చెన్నమల్ల చైతన్య, విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కే.కేశవరావ్ కు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాదులోని సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల సమావేశంలో వారు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ వేదిక అయిందని అన్నారు. ఉద్యమకారులు గుర్తింపు, సంక్షేమ పథకాల అమలుకు శాతవాహన యూనివర్సిటీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఉద్యోగ నియామకాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, అమరవీరుల కుటుంబాలకు లబ్ది వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నాయకులు జీడి రమేష్, వడ్లూరి భాస్కర్, మాడుగుల హిమసాగర్, జనార్ధన్, అనిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






