5 August, 2026 | 3:39 AM

ప్రధాన రహదారి డివైడర్లో మొక్కలు నాటిన సర్పంచ్ .

05-08-2026 01:47 AM

గాంధారి, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రధాన రహదారి మద్యలో గల డివైడర్ లో గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుకా సంజీవ్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని అన్నారు..

డివైడర్ మద్యలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు పత్తి సాయిలు, బెల్లాయి అశోక్, సిందె నితిన్, లైన్ రమేష్, జరుప్ల సంజీవ్, ఫీల్ అసిస్టెంట్ సాయి కుమార్, చద్మల్ సాయి కుమార్, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..