26 July, 2026 | 11:02 PM

గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన

02-06-2026 06:18 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో  సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం  ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వచ్ఛ వావ్ సురక్షిత జలవాయు ఎస్డబ్ల్యూఎం రూల్స్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సాలిడ్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. వ్యర్థాలను వర్గీకరించే నాలుగు రకాల చెత్త డబ్బాలను బ్లూ బ్లూ, రెడ్, బ్లాక్, గ్రీన్, ప్రజల ముందు వర్గీకరించి వాటిని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. సెగ్రిగేషన్ షెడ్ వద్ద గ్రామం లో నుండి వచ్చే ఆకులు, గడ్డి, వంటి వ్యర్ధాల నుండి కంపోస్ట్ ఎరువులను ఎలా తయారు చేయాలో సర్పంచ్ వివరించారు.