26 July, 2026 | 7:24 PM

అధ్యాపక సంఘ జిల్లా కార్యవర్గాల ఎన్నిక

26-07-2026 06:23 PM

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణా ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం కరీంనగర్,జగిత్యాల రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి జిల్లాల కార్యవర్గాలకు కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఎన్నికలు నిర్వహించారు.ఇట్టి ఎన్నికలలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా డా.ఎం. సత్యప్రకాశ్, కార్యదర్శిగా డా. జి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా డా.ఎ.రాజశ్రీ, ఉపాధ్యక్షుడిగా టి. రాజయ్య, స్టేట్ కౌన్సిలర్ గా బూర్ల వెంకటేశ్వర్లు, జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా డా.ఎన్. సంగీతారాణి, కార్యదర్శిగా డా.ఎ.శ్రీనివాస్, కోశాధికారిగా డా.ఇ. రాజకుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా జి. శ్రీధర్ రావు,  కార్యదర్శిగా డా.ఎ.ప్రసాద్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా  డా.జి.పురుషోత్తం, కార్యదర్శిగా డా.సిహెచ్. మారుతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన అభర్థులందరికీ టిజిసిజిటిఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కడారు సురేందర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.