26 July, 2026 | 11:02 PM

భారతదేశపు సాహసవీరులను గౌరవించిన అన్వయా కిన్ కేర్

26-07-2026 09:52 PM

హైదరాబాద్, జూలై 24, 2026: పదేళ్ల క్రితం, భారతదేశంలోని చాలా వరకూ స్టార్టప్ సంస్థలు ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్‌ వెంట పడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఆయన భారతదేశంలోని తల్లిదండ్రుల సంరక్షణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు, ఆ సాహసం 'అన్వయా కిన్ కేర్'గా రూపుదిద్దుకుంది. ఇది 38 నగరాల్లో 1.5 లక్షల మందికి పైగా వయోధికులకు మద్దతునిస్తూ, 80 లక్షల గంటలకు పైగా గృహ సంరక్షణను అందించింది, మరియు 97% ప్రాణాలను కాపాడిన రికార్డుతో 5,000కు పైగా వైద్య అత్యవసర పరిస్థితులను విజయవంతంగా నిర్వహించింది. జూలై 24న, అన్వయా తమ 10వ వార్షికోత్సవాన్ని కేవలం గతాన్ని గుర్తుచేసుకుంటూనే కాకుండా, భవిష్యత్తు వైపు దృష్టి సారించి వేడుక జరుపుకుంది. అన్వయా తమ దశమ వార్షికోత్సవ వేడుకలను 'కృతజ్ఞ' పేరిట నిర్వహించింది. 

ఈ వేడుకలో వయోవృద్ధులు, వారి కుటుంబాలు, అన్వయా కేర్ మేనేజర్లు, ఉద్యోగులు, భాగస్వాములు, ఆహ్వానిత అతిథులు ఒకచోట చేరారు. ఈ కార్యక్రమంలో దేశానికి విశేష సేవలు అందించిన సౌర్య పురస్కార గ్రహీతలు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సత్కరించడం జరిగింది. అలాగే, 'అన్వయ కృతజ్ఞ్య షోకేస్' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు; ఇందులో అన్వయ సభ్యులైన వృద్ధులు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేస్తూ, వయసు పైబడటం అనేది తమ భావాలను వ్యక్తపరచడానికి లేదా ఉత్సాహంగా జీవించడానికి ముగింపు కాదని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ, గిన్నిస్ రికార్డ్ గ్రహీత బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి, తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మరియు వృద్ధుల సంరక్షణ రంగానికి చెందిన ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఒక వృద్ధుని జీవితంలోని సంపూర్ణ అంశాలైన వారి శరీరం, వారి శ్రేయస్సు మరియు వారి విశ్వాసం వంటి సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన మూడు కొత్త సేవలను ప్రారంభించింది. వీటిలో ధరించగలిగే నొప్పి నివారణ పరికరమైన క్యూరాపాడ్; 3000 BC థెరప్యూటిక్స్ వారి చికిత్సాపరమైన ఆరోగ్య ఉత్పత్తుల శ్రేణి; మరియు భక్తి సేవల కోసం ఉద్దేశించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన పుణ్యక ఉన్నాయి. ఈ సందర్భంగా అన్వయా కిన్ కేర్  వ్యవస్థాపకుడు,మేనేజింగ్ డైరెక్టర్, ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ "పదేళ్ల క్రితం, నేను ఒక కంపెనీని నిర్మించాలని అనుకోలేదు. లక్షలాది భారతీయ కుటుంబాలు నిశ్శబ్దంగా ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించాలని అనుకున్నాను. ఈ మూడు ఆవిష్కరణలు, కేవలం ఉత్పత్తి జాబితాకు కొత్త వాటిని జోడించడం కోసం కాదనీ, వృద్ధులు తమ బాధ, ఆరోగ్యం పట్ల ఆకాంక్ష మరియు విశ్వాసం విషయంలో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుని వారికి అండగా నిలవడం దీని ఉద్దేశ్యమన్నారు.