26 July, 2026 | 10:38 PM

మార్కెట్ లోకి జెనో 100 ప్రో, జెనో పవర్‌బ్యాంక్

26-07-2026 09:45 PM

July 24, 2026 | ముంబై ః 

జెనో సంస్థ తన కొత్త జెనో 100 ప్రో స్మార్ట్‌ఫోన్ తో పాటు జెనో పవర్‌బ్యాంక్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జెనో 100 ప్రో o తన విభాగంలో అత్యంత అందుబాటు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా లభించింది.

దీంతో ఇది మరింత బలంగా, మన్నికగా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న అల్ట్రా లింక్ టెక్నాలజీ వల్ల నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ కొనసాగించడానికి సహాయపడుతుంది. ఈ ఫోన్ 3+5జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. అలాగే ఇటీవల విడుదలైన జెనో లైట్ మోడల్ కూడా 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో లభిస్తోంది.జెనో 100 ప్రో ప్రస్తుతం అమెజాన్ లో రూ.8,599 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.

అలాగే 10,000mAh మరియు 20,000mAh సామర్థ్యం గల జెనో పవర్‌బ్యాంక్‌లు వరుసగా రూ.1,299 మరియు రూ.2,069 (అదనంగా 10% తగ్గింపుతో) ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో అందుబాటులో ఉన్నాయి. జెనో లైట్ ధర రూ.7,999గా నిర్ణయించారు. జెనో సిరీస్ అనేది ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుందనీ, నేటి జెన్ జీ యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని, స్టైలిష్ డిజైన్, మెరుగైన పనితీరు, అందుబాటు ధరలను సమన్వయం చేస్తూ ఈ ఉత్పత్తులను తీసుకువచ్చినట్టు  ఐటెల్ సీఈవో అలిజీత్ తలపత్రా తెలిపారు. ఉత్పత్తి వ్యయాలు పెరిగినా, అత్యాధునిక సాంకేతికతను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

కొత్త జెనో 100 ప్రో ప్రధాన ఫీచర్లను చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 అంగుళాల 90Hz HD+ డిస్‌ప్లే అందించారు. అలాగే డీటీఎస్ సౌండ్ తో మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. డైనమిక్ బార్ ఫీచర్ ద్వారా బ్యాటరీ స్థితి, కాల్స్, నోటిఫికేషన్లు వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా అందించారు. అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉండటంతో టీవీ, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఈ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. అదనంగా 5000mAh బ్యాటరీ, 10W ఛార్జర్ తో పాటు ఈ ఫోన్ కామెట్ ఆరెంజ్, క్లౌడ్ వైట్ , బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. జెనో 20,000mAh పవర్‌బ్యాంక్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో పోర్ట్‌ను అందిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, అలాగే అనుకూల ల్యాప్‌టాప్‌లను కూడా ఛార్జ్ చేయగలదు.