వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
జనగామ,(విజయక్రాంతి): రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. గురువారం తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కావటి సుధాకర్, ఉప సర్పంచ్ నీల సంపత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తూకంలో పారదర్శకత పాటించాలని అధికారులను కోరారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నేరుగా రైతులకు అందుతుందని తెలిపారు. గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు ముత్త సాంబరాజు, అర్జుల సంపత్ రెడ్డి, వార్డ్ మెంబర్లు కాసాని గాలయ్య, సూర్య నాయక్, చింతల్ ఎల్లయ్య, నీలా కనకరాజు, సీసీ రాము, సీఏ బాలయ్య, సీఏ ఏదునూరి సప్న, శ్రీవిద్య, తాళ్లపల్లి అనిత, భాష బోయిన రాజు, భాషబోయిన రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.






