అదృష్టంగా భావిస్తున్నాను
- డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పదిరోజులపాటు జరిగిన డిసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులు(DCC Presidents' Training Classes) సోమవారం ముగిసింది. చివరి రోజు కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొని డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నాకు ప్రసంగించే అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ(Congress party) బలోపేతం కోసం రాహుల్ గాంధీ చేసిన సూచనలు, సలహాలను తూచ తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ పది రోజుల శిక్షణలో ఎన్నో అంశాలపై అవగాహన చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అనంతరం సంజీవ్ ముదిరాజ్ కుటుంబంతో రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ ఎంతో ఆప్యాయంగా పలకరించినట్లు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. రాహుల్ గాంధీని కలిసిన వారిలో సంజీవ్ ముదిరాజ్ భార్య డాక్టర్ ఎ. అనుపమ, అల్లుడు డాక్టర్ శశాంక్, కూతురు వర్ణిక, చెల్లెల్లు మాధవి, పల్లవి తదితరులు ఉన్నారు.




