3 March, 2026 | 12:35 PM

జడ్చర్ల ఆసుపత్రిలో జరిగిన ఘటన కలచివేసింది

03-03-2026 10:43 AM

మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మా రెడ్డి

జడ్చర్ల : మున్సిపాలిటీ లోని ప్రభుత్వ హాస్పిటల్(Jadcherla Hospital incident) లో మృతదేహన్ని భద్రత పరచలేని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మా రెడ్డి(Former Minister Lakshma Reddy ) అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించడం ప్రభుత్వ హాస్పిటల్స్ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణ కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందన్నారు.  మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీఎం సొంత జిల్లా, ఇన్ ఛార్జ్ గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటికి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.