24 June, 2026 | 6:48 PM

రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం

24-06-2026 05:31 PM

విత్తనాల మేళా ప్రారంభం

ఇల్లందు, జూన్ 24 (విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని సుదిమళ్ల రైతు వేదికలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విత్తనాల మేళాను మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి విత్తనాల మేళాను ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించడం, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ మేళాను నిర్వహిస్తోందని తెలిపారు. రైతులు ధృవీకరించిన విత్తనాలనే కొనుగోలు చేసి పంటల సాగులో నష్టాలను నివారించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మండల రాంమహేష్, సొసైటీ చైర్మన్ మెట్ల కృష్ణ, సుదిమళ్ల సర్పంచ్ కుంజా సుగనయ్య, సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షురాలు పాయం స్వాతి, కొమ్ముగూడెం సర్పంచ్ తాటి యశోద, మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, మాజీ ఎంపీపీ మోకాళ్ల వెంకటమ్మ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, నాయకులు తాటి భిక్షం, శ్రీను, తిరుపతి, సతీష్, ప్రసన్న, వీరా, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.