13 July, 2026 | 5:48 PM

Breaking News

గుడుంబా తయారీకి బెల్లం తరలింపు.. 7 టన్నులు పట్టివేత   •   పిట్టంపల్లి గ్రామంలో పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి   •   పాఠశాల ఆవరణలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయాలి   •   ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ   •   ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు   •   జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ   •   కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •  

బరితెగిస్తున్న ఇసుక మాఫియా

24-03-2026 05:07 PM

పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్

తాండూరు,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా బరితెగిస్తుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనంపైకి దూసుకు రావడంతో వాహనం ముందరి భాగం పాక్షికంగా ధ్వంసం అయింది. బషీరాబాద్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్ల ను అడ్డుకొని వివరాలు సేకరించినందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పోలీస్ వాహనంపైకి ట్రాక్టర్ దూసుకుని వచ్చి ఢీ కొట్టింది.

వాహనంలో ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గతంలో కూడా ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ను ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తాజా ఘటనలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్లను కనుగొనేందుకు పోలీసులు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్రమ ఇసుక రవాణాకు స్థానికంగా కొందరు అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసనల్లోనే ఇసుక మాఫియా నడుస్తుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.