యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయండి
ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్యకు పాలకమండలి వినతి
యాదగిరిగుట్ట, జూన్ 12: యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నిరంతరం కృషి చేస్తున్నారని, రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు.
శుక్రవారం బీర్ల ఐలయ్య నివాసంలో యాదగిరిగుట్ట మున్సిపల్ పాలకమండలి సభ్యులు ఆయనను కలిసి నిధులను మంజూరు చేయవలసిందిగా వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి కొరకు సిసి రోడ్లు, డ్రైనేజ్, స్మశాన వాటిక అభివృద్ధి, సోలార్ విధి దీపాలు, పట్టణంలో స్వాగత తోరణాలు వివిధ అభివృద్ధి కొరకు సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయుటకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ బరిగే రమ్య రామచందర్, కౌన్సిల్ సభ్యులు బోడ రాధా సురేష్, బూడిద మధు, కాటబత్తిని స్వప్న ఆంజనేయులు, మాలోతు సరోజ హరీష్, కర్రే మాధవి ప్రవీణ్, పెలిమెల్లీ లావణ్య శ్రీధర్, పేరబోయిన సత్యనారాయణ, సాధునేనీ ధనలక్ష్మి మధుకర్, ముక్కెర్ల మల్లేష్, బబ్బురి శ్రీధర్, కోఆప్షన్ సభ్యులు బండి జంగమ్మ శ్రీశైలం, గౌలికర్ అరుణ రాజేష్, ఎండి రహిమ సలాం, షేక్ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు.






