28 February, 2026 | 7:47 PM

ఇఫ్తార్ విందు ఇచ్చిన సమతా కుమార్

28-02-2026 05:33 PM

సుల్తానాబాద్,(విజయకాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ కందునురి సమతా కుమార్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ... పార్టీ ఏదైనా, కులం మతం ఏదైనా మనమందరం ఒకటే అని భావాన్ని చాటి చెప్పడం తో ముస్లిం సోదరులు హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కుమారుకు ముస్లిం సోదరులు అభినందనలు తెలుపుతూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.