28 February, 2026 | 11:22 PM

వీధి వ్యాపారులకు ఊరట

28-02-2026 05:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం అమలు చేస్తున్న తైబజార్ రద్దు కావడంతో వీధి వ్యాపారులకు ఊరట కలిగింది. మున్సిపల్ తొలి పాలకవర్గ సమావేశంలోని నూతన చైర్పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తై బజార్ రద్దు చేస్తూ తీర్మానం చేశారు.

పట్టణంలోని బస్టాండ్ గాంధీచౌక్, మంచిర్యాల చౌరస్తా, గాంధీ మార్కెట్ చౌరస్తా కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై పొట్టకూటికోసం విధి వ్యాపారాలు చేసుకునే వారికి తై బజార్ వసూలు చేసేవారు. ప్రతి రోజు రూ.30 చొప్పున రుసుము బస్సులు చేసి మున్సిపల్ ఆదాయ మార్గాలను పెంచుకుంది. విధి వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టై బజార్ రద్దు చేయడంతో పట్టణంలోని వీధి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.