8 May, 2026 | 4:31 PM

పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం

08-05-2026 03:26 PM

దేవరకొండ,విజయక్రాంతి: శుక్రవారం పి.ఏ.పల్లి గ్రామ ప్రాథమిక పశువైద్య కేంద్రంలో పశువులలో గర్భకోశ సంబంధిత వ్యాధులకు ఉచిత చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ వంగల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వంగల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా గ్రామంలోని పశువులకు గర్భాశయ సంబంధిత సమస్యలు ఉన్న యజమానులు తమ పశువులను తీసుకువచ్చి ఉచితంగా చికిత్స పొందాలని కోరారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున పశువుల కాపరులు, గొర్రెల కాపరులు పశువులను చల్లటి సమయాల్లో మాత్రమే మేపడానికి తీసుకెళ్లాలని సూచించారు.ఈ శిబిరంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ మహేందర్ రెడ్డి, ప్రత్యేక అధికారి డాక్టర్ పిట్టల చంద్రబాబు, రామావత్ నరేష్ నాయక్, మహ్మద్ మొహిన్, రజిత, గ్రామ ఉపసర్పంచ్ కట్టేబోయిన వెంకయ్య, బండారి నాగరాజు, పోశం రెడ్డి, జోగి రెడ్డి, విష్ణుమూర్తి, బండారి కోటయ్య, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.