8 May, 2026 | 4:18 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ

08-05-2026 03:23 PM

భిక్కనూర్, మే 08(విజయ క్రాంతి):  వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపొందనకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఆర్. రాజ గంగారెడ్డి తెలిపారు. భిక్కనూర్ మండలంలోని జడ్పీహెచ్‌ఎస్ (జి)భిక్కనూర్ పాఠశాలలో ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్యాంప్ నిర్వహించనున్నారు.

6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఈ శిక్షణ అందించబడుతుంది. క్యాంపులో డ్రాయింగ్, కంప్యూటర్, కరాటే, యోగా, ఇండోర్ గేమ్స్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని మండల విద్యాధికారి సూచించారు.