ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ జెడీఏ సుచరిత
మంచిర్యాల, (విజయక్రాంతి) : ప్రభుత్వం ద్వారా అమలు చేసే పథకాలను మహిళలు, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ కార్యాలయ జేడీఏ సుచరిత కోరారు. ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక ‘రైతు వారోత్సవాల’లో భాగంగా శుక్ర వారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి రైతు వేదికలో మత్స్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మత్స్యశాఖ ఏడీ (AD) అవినాష్ తో కలిసి మాట్లాడారు. చేపల ఉత్పత్తి పెంచాలని, ముర్రెల్ క్లస్టర్ ద్వారా మత్స్యకారులు లాభపడతారని సూచించారు. మత్స్యశాఖ పథకాలపై వివరించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వ్యక్తిగత చేపల చెరువుల నిర్మాణం చేయడానికి, జనరల్ 40 శాతం, SC/ ST/ WOMEN కి 60 శాతం సబ్సిడీ ఉందన్నారు.
డీఏఓ సురేఖ వ్యవసాయ శాఖ ద్వారా అందించే ప్రభుత్వ పథకాలు, వరి సన్నాల సాగుకు అనువైన రకాలు గురించి రైతులకు తెలియచేశారు. వ్యవసాయ శాఖ పథకాలు, మట్టి పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డ్ ల ప్రాముఖ్యత, సమగ్ర వ్యవసాయ విధానాలపైన అవగాహన కల్పించారు. పశు సంవర్థక శాఖ అధికారి తిరుపతి వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా అందించే సబ్సిడీ పథకాలు, శాఖ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) సురేఖ, మంచిర్యాల ఏడీఏ (ADA) కృష్ణ, ఫ్యాకల్టీ నరేష్, మండల వ్యవసాయ అధికారి (MAO) మహేందర్, ఏఓ (AO) రజిత, పశు సంవర్థక శాఖ అధికారి తిరుపతి, హార్టికల్చర్ అధికారి (HAO) సహజ, మందమర్రి ఏఈఓ (AEO) ముత్యం తిరుపతి, సంధ్య, ఏఎంసీ డైరెక్టర్ (AMC DIRECTOR) లు మల్లేష్, లింగయ్య, ఆత్మ డైరెక్టర్ (ATMA DIRECTOR) మోహన్ రావు, మంచిర్యాల, మందమర్రి, నస్పూర్ మండలాల రైతులు, బెస్త సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






