8 May, 2026 | 4:30 PM

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్

08-05-2026 03:16 PM

మందమర్రి, (విజయక్రాంతి) : మందమర్రి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శుక్ర వారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపాలిటీ, మండలం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.