ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువైద్య శిబిరం
08-05-2026 03:25 PM
భిక్కనూర్,మే8(విజయ క్రాంతి) : భిక్కనూర్ మండలంలోని తిప్పపూర్ గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య చికిత్సలు అందించడంతో పాటు దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషణపై రైతులకు అవగాహన కల్పిస్తూ నిపుణులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దేవేందర్, గోపాలమిత్రలు మహేష్ గౌడ్, సురేష్, గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, ఉపసర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






