గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి
24-04-2026 04:39 PM
కార్యక్రమంలో మాట్లాడుతున్న బోథ్ గ్రామ సర్పంచ్
బోథ్,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు చిన్నారులకు మరిన్ని సేవలందించాలని బోత్ సర్పంచ్ అన్నపూర్ణ పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లు 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సఖి వన్ స్టాప్ సెంటర్ సేవల పనితీరు గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత నిపుణులు నిఖిలేశ్వర్ రెడ్డి మాతా శిశు సంక్షేమ పథకాల గురించి అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కుమార్ అంగన్వాడి సూపర్వైజర్ మౌనిక పంచాయతీ ఈవో అంజయ్య టీచర్ సుమలత అంగన్వాడి టీచర్లు కిశోర బాలికలు పాల్గొన్నారు






