24 April, 2026 | 6:12 PM

Breaking News

నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •  

మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ

24-04-2026 04:37 PM

దేవరకొండ,(విజయక్రాంతి): మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అమ్మ టోనీగూడెం గ్రామ సర్పంచ్ ఆడారపు హరికృష్ణ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం అమ్మ టోనీగూడెం గ్రామంలో ఆయన అధ్యక్షతన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు స్వచ్ఛతపై అవగాహన పెంచుకొని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి. సరిత, ఉప సర్పంచ్ రమావత్ అంజలి, సోమ్లా నాయక్, వార్డు సభ్యులు సైదులు, రమణమ్మ, మురళమ్మ తదితరులు పాల్గొన్నారు.