28 July, 2026 | 1:34 AM

హెపటైటిస్‌పై అప్రమత్తంగా ఉండాలి

28-07-2026 12:38 AM

డాక్టర్ బాలమురళీకృష్ణ

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం (జూలై 28) సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డా. కె. బాల మురళీకృష్ణ వైరల్ హెపటై టిస్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించా రు.

హైదరాబాద్‌లో జీవనశైలి మార్పులతో ఫ్యాటీ లివర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ఫ్యాటీ లివర్‌తో పాటు హెపటైటి స్‌బి-బీ, హెపటైటిస్ ఉంటే కాలేయం మ రింత వేగంగా దెబ్బతింటుందని తెలిపారు. హెపటైటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే లివర్ సిరోసిస్, లివర్ వైఫల్యం, లివర్ క్యా న్సర్ వంటి సమస్యలను నివారించవచ్చన్నా రు. ప్రమాద కారకాలు ఉన్నవారు తప్పనిసరిగా హెపటైటిస్-బీ, సి పరీక్షలు చేయించుకో వాలని, ప్రతి శిశువుకు హెపటైటిస్-బీ టీకా వేయించాలని సూచించారు.