నేలమ్మ సిగలోన సిరిమల్లెవా..
తిరువీర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతు డు’. ఇందులో కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏషియన్ ఫిలి మ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకర య్య గౌడ్ సమర్పిస్తున్న ఈ సినిమాను రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జీజీ విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యలో మేకర్స్ ఈ సిని మా నుంచి సెకండ్ సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ను విడుదల చేశారు. ‘సిత్తరాల నవ్వు.. సిలకల్లే ను వ్వు.. సేమంతి పువ్వు.. అంగనా.. నీలాల కళ్లు పారే సెలయేళ్లు ఒంపు పరవళ్లు.. అంగనా.. నేలమ్మ సిగలోన సిరిమల్లెవా.. మరి నీ సూపే తొలి వేకువ.. నిను తాకి మొలకేసే సేనూసెలక..’ అంటూ సాగుతోందీ గీతం. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు డైరెక్టర్ జీజీ విహారి లిరిక్స్ అందించగా, జావెద్ అలీ పాడారు.
ఏరువాక పున్నమి లాంటి అమ్మాయి, కొండగాలి దేవర వంటి అబ్బాయి మధ్య ప్రేమను చూపిస్తూ రూపొందించిన ఈ మట్టి పాట సంగీత ప్రియుల హృదయాలను దోచేస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట; సంగీతం: కేపీ; సాహిత్యం: చంద్రబోస్, గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ డిజైన్:- గాంధీ నడికుడికర్; ఎడిటర్: ప్రవీణ్ పూడి.






