19 May, 2026 | 2:53 AM

ఎండవేడి, వడగాలులను తట్టుకునేందుకు సహస్ర ఫౌండేషన్

19-05-2026 01:35 AM

ఎండవేడి, వడగాలులను తట్టుకునేందుకు సహస్ర ఫౌండేషన్ సోమవారం ‘విజయక్రాంతి’ సిబ్బందికి ఉచితంగా హోమియో మందును అందజేసింది. సహస్ర ఫౌండేషన్ తరఫున డాక్టర్ సీహెచ్ శివప్రసాద్ హోమియో మందును స్వయంగా అందజేశారు. వడదెబ్బ నివారణకు తాము జర్నలిస్టులకే కాకుండా పోలీసులకు కూడా హోమియో మందులను ఉచితంగా అందజేస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ హోమియో వైద్యుల సంఘానికి అధ్యక్షుడు కూడా అయిన డాక్టర్ శివప్రసాద్, జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమానికి సహస్ర ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు.