పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం రండి
ప్రజల మేలు కోరితే.. భాగస్వాములు కావాల్సిందే
పీయూ జాతీయ సెమినార్ ఇక్కడే నిర్వహించాలి
విద్య హబ్ చేస్తామన్న సీఎం.. సెమినార్ కు జాగలేదా?
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాలమూరు ప్రజలు బాగుకోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆల్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పీయూ జాతీయ సెమినార్ నిర్వహణకు అవకాశం వచ్చిందని, ఇక్కడ నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. విజన్ ఇండియా 2047 సదస్సు కాన్హా ఆశ్రమం లో నిర్వహించడం బాధాకరమన్నారు. విద్య హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, ఆయన సొంత జిల్లాలో వసతి సౌకర్యం లేదని వేరే జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నారన్నారు.
టూరిజం మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉండటం సరి కాదని, పరిశ్రమలు, ఎయిర్ పోర్ట్ వస్తున్నాయని,మెడికల్ హబ్ పెడితే వసతి సౌకర్యాలు ఉన్నాయా అని బయటి దేశాల డాక్టర్స్ అడిగారని, బస్టాండ్ ముందు టూరిజం హోటల్ లో రెండు పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్, 350 రూమ్స్.. మన్యం కొండ వద్ద 100 రూమ్స్ హోటల్స్ ప్రారంభించామని, వాటిని పూర్తి చేయకపోవడం కారణంగానే ఇప్పుడు వసతి సమస్య వస్తుందన్నారు. అందాల పోటీ కి వచ్చిన పోటీదారులను బస్సు లో తీసుకువచ్చిన టూరిజం మంత్రులు, అధికారులు.. ఇప్పుడు ఈ సదస్సుకు వచ్చిన వారికీ హైదరాబాద్ లో వసతి కల్పించి ఇక్కడికి సదస్సుకు బస్సు లో తీసుకురచన్నారు.
ఏప్రిల్ లో వస్తే మంత్రి చొరవ తీసుకొని సమీక్షా చేసి ఏర్పాట్లు చేయాల్సి ఉండే కానీ చేయలేదని,ఈ సదస్సుకు వచ్చే వారికీ హైదరాబాద్ లో వసతులు, భోజన సౌకర్యం,మహబూబ్ నగర్ లో సదస్సు కు వచ్చేందుకు బస్సులు నేను ఎకర పొలం అమ్మి అయిన కల్పిస్తాని, ఇక్కడే రెండు రోజుల సదస్సు పెట్టాలన్నారు.
10 టీఎంసీ వరకు వరద నీరు వస్తుంది
ఆంధ్రప్రదేశ్ కు పంపించకుండా ఇక్కడ రిసర్వాయర్లు.. చెరువులు నింపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జూరాల కుడి, ఎడమ కాలువలకు నీరు ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యే కలిస్తే కాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి... అధికారులు చెప్పారన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ లో నీరు నింపుకునేందుకు అవకాశాలు ఉన్న పంపులు..కేఎల్ఐ వద్ద ఒక పంపు ఆన్ చేయాలని, 25 లక్షల ఎకరాలకు వర్షాలు లేకున్నా సాగు చేసేందుకు అవకాశం ఉండే విధంగా కెసిఆర్ గారు ప్రణాళిక చేసి పనులు చేపట్టారన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచే విషయం పై పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దమని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.






