వాగు దాటుతూ మహిళా మృతి
ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో ఎర్వ చింతల్ గ్రామపంచాయతీ చామనపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న వాగు దాటుతూ దానిలో పడి మహిళ మరుసుకోల పారు (47) అనే మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన భర్తతో చామనపల్లి నుంచి ఎర్వ చింతల్ గ్రామానికి వెళ్లి తిరిగి అదే మార్గం గుండా మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా మహిళా వాగు దాటుతూ దానిలో మునిగి మరణించింది.
వెంట ఉన్న భర్త బహిర్భూమికి వెళ్ళగా జరిగిన సంఘటన గమనించని భర్త ఇంటికి వెళ్లి భార్య కోసం వాకాబు చేయగా ఆచూకీ లభించకపోవడంతో వాగు వద్దకు వచ్చి వెతకగా మృతదేహం లభించిందని ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని ఖానాపూర్ ఆసుపత్రి పోస్ట్మార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






