మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా యుగంధర్ యాదవ్
29-07-2026 10:35 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ నియామకం అయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా సెక్రెటరీగా సేవలు అందిస్తున్నారు. వరంగల్ బ్రాంచ్ లో వర్కింగ్ కమిటీ సభ్యులు గత 14 సంవత్సరాలుగా పని చేస్తున్న యుగంధర్ యాదవ్ సేవలు గుర్తించి మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శంకర్ రావు, జోనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ అయనను జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు నియామకం చేశారు. అయన ఎంపిక పట్ల మజ్దూర్ యూనియన్ నాయకులు రమేష్, వంశీ, కృష్ణ, సురేష్, శ్రీనివాస్, సతీస్, మహేష్, రాకేష్, కనకయ్య, రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.






