27 July, 2026 | 1:32 AM

అటవీ శాఖ సిబ్బందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి

27-07-2026 12:38 AM

అశ్వాపురం, జులై 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు కోయ ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీశాఖ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని మానవ హక్కు ల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మానవ హక్కుల వేదిక ఐదుగురు సభ్యుల బృందం మనుబోతులపాడు గ్రామానికి వెళ్లి బాధిత ఆదివాసులను కలిసి ఘటన వివరాలను సేకరించింది.

ఈ సందర్భంగా బా ధితులు తమపై అటవీశాఖ సిబ్బంది దాడి చేసి గాయపరిచారని, ఫిర్యాదు చేసేందుకు అశ్వాపురం పోలీస్స్టేషన్కు వెళ్లినా పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని ఆరోపించినట్లు తెలిపారు. ఆదివాసులపై దాడికి పాల్పడిన అటవీశాఖ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పోడు సాగు చేస్తున్న ఆదివాసులకు శాశ్వత హక్కు పట్టాలు ఇవ్వాలని, బాధితుల ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించిన పోలీసు అధికారిపై చర్యలు తీ సుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాం డ్ చేసింది. నిజ నిర్ధారణ బృందంలో డా. ఎస్. తిరుపతయ్య, బదావత్ రాజు, ఆదినారాయణ, దిలీప్, సదానందం పాల్గొన్నారు.