పలు గ్రామాల్లో రైతు వారోత్సవాలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట, మాల్తుమ్మెద, ఆత్మకూర్ రైతు వేదికల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు కార్యక్రమం ప్రారంభమయ్యాయని మండల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీంట్లో భాగంగా మొదటి రోజు నేల ఆరోగ్యంపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సోయల్ హెల్త్ కార్డు ప్రాముఖ్యత, మట్టి నమూనాలు తీయడం పై రైతులకు వివరించడం జరిగిందన్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద మట్టి నమూనాలు తీసిన రైతులకు రాయల్ హెల్త్ కార్డులను అందజేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యంపై లై రైతులకు వివరించడం జరిగింది.నానో ఎరువుల ఉపయోగం వాడకం రైతులతో నేల ఆరోగ్యానికి కాపాడుతామని ప్రతిజ్ఞ రైతులతో చేయించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అనిల్ రెడ్డి, రేవంత్ ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఠాగూర్, ఏఈఓ ప్రశాంత్ సర్పంచులు మన్నె వెంకటి, పుప్పాల సాయిలు, ఉప సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






