4 May, 2026 | 10:03 PM

అధికారులు అందుబాటులోఉండాలి

04-05-2026 08:52 PM

-  ప్రజావాణికి 32 అర్జీలు 

- ప్రజావాణినీ కలెక్టర్ తనిఖీ

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజావాణి  కార్యక్రమానికి సబ్ కలెక్టర్ మనోజ్ హాజరై  మాట్లాడారు. జీవో ఎం ఎస్ నంబర్ 3  ప్రభుత్వం జారీ జరిగిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ జీవో ను జారీ చేశారని తెలిపారు. ప్రజల కు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. 32 అర్జీలు వచ్చాయి. డివిజన్ స్థాయిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి కి 32 అర్జీలు వచ్చాయి.

- సకాలంలో అర్జీలు పరిశీలించాలి

కలెక్టర్ కుమార్ దీపక్ అంతకుముందు లోబెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు  ప్రజావాణి కార్యక్రమాన్ని చిత్తశుద్దిగా నిర్వహించాలన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో నోడల్ అధికారిగా రాజస్వ మండల అధికారిని నియమించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరించిన 30 రోజులలోగా పరిష్కరించాలని, లేని పక్షంలో తిరస్కరణ, అందుకు గల కారణాలతో దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల సంబంధిత వివరాలను పోర్టల్ లో నమోదు చేసి అర్జీదారులకు రసీదు అందించాలని, దరఖాస్తుదారులు ప్రజావాణి పోర్టల్ లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి వచ్చే ప్రజలకు త్రాగునీరు, కుర్చీలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.