రైతు భరోసా లేని పతకం..
* రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): ఖరీఫ్ లో వేసే పంటలకి పెట్టుబడి పెడుదామని అనుకున్న రైతులవద్దా పెట్టుబడికి పెట్టె ఆర్థిక పరిస్థితి బాగు లేక పంటల సాగు కొరకు జిల్లాలోని రైతులు అప్పుల కోసం తిరుగుతున్నారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా శాఖ అధ్యక్షుడు సంగెపు బొర్రనా అన్నారు. బుధవారం ఇంద్రవెల్లిలో రైతులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారులు ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని విరుద్ధ నేతల రోజులు సాగు చేస్తున్న భూములకు సైతం రైతు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనతోపాటు రైతులు పాల్గొన్నారు.






