మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామంలో ఇటీవల ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను సర్పంచ్ బేతం రుక్మిణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రావు రఘు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, హాస్పిటల్‌లో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు.
అర్హులైన కుటుంబాలకు నేరుగా సహాయాన్ని అందించడం ద్వారా వారి ఆస్పత్రి ఖర్చులకు ఎంతో కొంత సహాయ పడుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల మంజూరు విషయంలో అశ్వారావుపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, దీనికి ముఖ్య కారణం స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ వహించడమేనని పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడే ఇటువంటి నాయకుడు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇటువంటి నాయకుడు ప్రజల గుండెల్లో చిర స్థాయిలో నిలిచిపోతారని కొనియాడారు.






