సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లాలో యువతకు మెరుగైన సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ, తాడ్వాయిలో అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోర్సుల (ATC) ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏటీసీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని తెలిపారు.
ప్రభుత్వ ఐటీఐ, తాడ్వాయిలో మొత్తం ఆరు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ కోర్సులు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 జూన్ 30వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. ప్రవేశాలు, కోర్సుల వివరాల కోసం ప్రభుత్వ ఐటీఐ, తాడ్వాయి కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటీఐ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.






