సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి
17-06-2026 07:56 PM
ప్రముఖ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సనాతన ధర్మ పరిరక్షణ,హిందూ సంస్కృతిని భావితరాలకు అందించి వాటిని కాపాడుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త,ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రధమంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాధి క్షేత్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం హిందూ సనాతన ధర్మం, కుటుంబ విలువలు, భక్తి మార్గం, ఆధ్యాత్మిక అంశాలు, హిందూ ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్లపై భక్తులకు హితబోధ చేశారు.






