బాధ్యతగా పని చేయండి.. రైతులకు అండగా ఉండండి..
ఉమ్మడి మండల సహకార కమిటీ ఎన్నిక
కమిటీ నూతన కార్యవర్గంను అభినందించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
గండీడ్ జూలై 15: వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాధ్యతగా రైతులకు అండగా ఉండాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతనంగా ఏర్పాటుచేసిన పాలకమండలికి. అధ్యక్షత వహించిన పరిగి ఎమ్మెల్యే డా టి.రామ్మోహన్ రెడ్డి నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉంటే సహకార సంఘం కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఆ మేరకు కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు.
నూతన కమిటీ కార్యవర్గం..
పిఎసిఎస్ చైర్మన్ గా కమతం శ్రీనివాస్ రెడ్డిగా, డైరెక్టర్ లు కమతం విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త నారాయణ, సి.భాసయ్య, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, బాలముకుందం, నరసింహారావు, భాష్యనాయక్, హనుమంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, బి.పుష్పలత జక్కులపల్లి బందెమ్మ ఉన్నారు. ఈ కార్యక్రమం పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి, కేఎం నారాయణ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ జి.లక్ష్మీనారాయణ, భగవంత్ రెడ్డి. రామ్ లాల్. మహమ్మదాబాద్ తాసిల్దార్. విద్యాసాగర్ రెడ్డి, డిసిఒ కృష్ణ, డిసీఏవో టైటాన్స్ పాల్. సీఈఓ ఆశన్న, ఖాజా తదితరులు పాల్గొన్నారు.






